ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు….
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా లో అత్యధిక జనాభా కల కురువలను గుర్తించి ముఖ్యమంత్రి నామినేటెడ్ పదవులు కేటాయించి నందులకు ముఖ్యమంత్రి కి కర్నూలు జిల్లా కురువ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కురువ మల్లయ్య కు ఇచ్చినందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు హర్షం ప్రకటించారు. కర్నూలు ఎం. పి. బస్తిపాటినాగరాజు కి,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.