NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం కి కృతజ్ఞతలు… బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం                             

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ఇచ్చిన మాట మేరకు క్యాబినెట్ లోను అసెంబ్లీలోను తీర్మానం చేసి కేంద్రానికి బేడ బుడగ జంగాల సమస్యపై నివేదిక పంపినందుకు యావత్ మా జాతి తరపున కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నామని, ఆ జాతి నేత తూర్పాటి మనోహర్ పత్రిక పూర్వకంగా తెలియజేస్తున్నాము. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ మెరుగు నాగార్జునకి, SC చైర్మన్కి,క్యాబినెట్ మంత్రులకు మరియు అసెంబ్లీ ప్రతినిధులకు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా జాతి రిజర్వేషన్ గురించి గత 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం కానీ ఈరోజుకు రాష్ట్రం నుండి కేంద్రం కోరిన ఫార్మాట్ ప్రకారం సంపూర్తిగా నివేదిక పంపడం చాలా సంతోషమైన విషయం. కేంద్రంలో కూడా 2002 of 61 Act షెడ్యూల్డ్ కులాల జాబితాలో జరిగిన తప్పిదాలను సవరణ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంచార దళిత బేడ బుడగ జంగం కులం ప్రజానీకం ఇంకా నేటి వరకు అన్నగారిన్న ,యాచక వృత్తి ద్వారా కాలం వెళ్లబుచ్చు వ్యవస్థ రూపుమాపి, నవ సమాజంలో ఆత్మగౌరవంగా జీవించే విధానం ఈ సమాజంలో నెలకొన్నాలంటే మాకు సక్రమమైన రిజర్వేషన్ అందాలని ఆశిస్తున్నాం.  తూర్పాటి మనోహర్ ఆ జాతి నేత తెలియజేశారు.

About Author