ఎంపీకి కృతజ్ఞతలు: కోడుమూరు వైసీపీ నేతలు
1 min readపల్లెవెలుగు వెబ్:కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి.. రూ.25 కోట్లు నిధులు మంజూరు చేయించిన ఎంపీ సంజీవ్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కోడుమూరు వైసీపీ నాయకులు, గ్రామపెద్దలు. గురువారం ఎంపీ కార్యాలయంలో కోడుమూరు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు,వైస్సార్సీపీ నాయకులు,గ్రామ ప్రజలు ఎంపీ సంజీవ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాగునీటి సమస్య గురించి చెప్పిన వెంటనే స్పందించి.. నిధులు విడుదల చేస్తానని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో కోడుమూరు వర్కూరు, చనుగొండ్ల గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ప్యాలకుర్తి రమేష్ ,cb అజయ్ కుమార్ మరియు dr.షాకీర్, బలరాం,లాయర్ ప్రభాకర్, రాజశేఖర్ రెడ్డి, రాముడు, అయ్యప్ప మరియు గ్రామ పెద్దలు, కోడుమూరు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.