NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీఆర్వో సేవలకు గుర్తింపు..

1 min read
మాట్లాడుతున్న వీఆర్వో జయరామిరెడ్డి

మాట్లాడుతున్న వీఆర్వో జయరామిరెడ్డి

– VRO లను DDO లుగా నియమిస్తూ జీఓ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
– సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి కృతజ్ఞతలు

  • వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి
    పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : సచివాలయ శాఖలో రెవిన్యూ శాఖకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డికి గ్రామ రెవెన్యూ అధికారుల తరుపున APVRO ల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి A. మౌలిబాష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్వోలను డీడీఓలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం GO No: 2 విడుదల చేసిందని, దీంతో తమకు ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించిన సీఎంకు అభినందనలు తెలియజేశారు. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న VRO కు కొంత ఉపశమనం కలిగిందని… ఇదే ఉత్సాహంతో బయోమెట్రిక్ మినహాయింపు కొరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా APVRO ల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి A. మౌలిబాష వెల్లడించారు.
    జీఓనం.2 విధివిధానాలు…
  1. పంచాయతీ సెక్రెటరీ అనే వారు గ్రామ పంచాయతీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంటే కార్యనిర్వహణ అధికారి గా ఉంటారు. వారు గ్రామ పంచాయతీకి మరియు గ్రామ సచివాలయానికి లింక్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తారు.
  2. పంచాయతీ కార్యదర్శులు మినహా, మిగిలిన సచివాలయ సిబ్బంది అందరికీ డిజిటల్ అసిస్టెంట్ తో సహా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(VRO) DDO గా ఉంటారు.
  3. గ్రామ వాలంటీర్లకు కూడా వీఆర్వో నే DDO గా ఉంటారు.
  4. ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అమలు అయ్యేలాగా వీఆర్వో కోఆర్డినేషన్ చేస్తారు.
  5. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుండి 5 మినహా మిగిలిన వారు అంతా ( సచివాలయ సిబ్బంది ) క్యాజువల్ లీవ్ అనేది రెస్పెక్ట్ హెడ్ డిపార్ట్మెంట్ (మండల లెవెల్ ) వారికి సమర్పించాలి. CL అప్లికేషన్ అనేది వీఆర్వో ద్వారా మండల లెవల్ కు చేరుతుంది.
  6. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుండి 5 వరకు మరియు పంచాయతీ స్టాప్ అనగా రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాప్ వారికి క్యాజువల్ లీవ్ అనేది సంబంధిత గ్రామ సర్పంచ్ ఆమోదంతో వస్తుంది.

About Author