ఆ మట్టి విలువ బంగారం కంటే ఎక్కువే..!
1 min readపల్లెవెలుగు వెబ్: మట్టి విలువ బంగారం కంటే ఎక్కువేంటి అనుకుంటున్నారా?. అవును. అంగారక గ్రహం నుంచి భూమి మీదకు ఒక తులం మట్టిని తీసుకురావాలంటే 729 కోట్లు ఖర్చు అవుతోంది. బంగారం కూడ అంత విలువ చేయదు. బంగారం కంటే ఈ మట్టి 1.44 లక్షల కోట్లు ఎక్కువ. అంగారకుడి మీదకు పర్సెవరెన్స్ రోవర్ ను పంపిన విషయం తెలిసిందే. అది అంగారకుడి మీద జెజిరో బిలం వద్ద దిగింది. అక్కడి మట్టిని సేకరించి అంగారకుడి మీద జీవరాసుల జాడను గుర్తించే యత్నం చేస్తున్నారు. అక్కడి మట్టిని భూమి మీదకు తీసుకొచ్చే యత్నం చేస్తున్నారు. 907 గ్రాముల మట్టి భూమి మీదకు చేరడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ మొత్తం మట్టిని తీసుకురావడానికి రూ.65,643 కోట్లు అవసరం అవుతాయట.