ఆ డీలర్ అంటే అందరికీ భయమే..!
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని ఆ రేషన్ డీలర్ అంటే అందరికీ భయమే. కారణాలు ఏమైనా తమపై ఏమైనా అధికారులు దాడులు నిర్వహిస్తే వెంటనే ప్రతిస్పందిస్తూ ప్రత్యారోపణలు చేయడం ,కాదు కూడదంటే ఎంతటికైనా తెగించే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత మూడు, లేదా నాలుగు సంవత్సరాల క్రితం మహానంది గ్రామపంచాయతీకి సంబంధించి రేషన్ డీలర్ అక్రమంగా అనధికారికంగా 150 ప్యాకెట్లు పైనే అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచారన్న సమాచారం మేరకు ప్రత్యేక నిఘా అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. ఇది అప్పట్లో మహానంది మండలంలో సంచలనంగా మారింది. ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో అధికార పార్టీ అండదండలతో ఎలాగో ఒకలాగా బయటపడినట్లు తెలుస్తుంది. నేడు కూడా అదే పందా అనుసరిస్తూ పార్టీలు మారుతూ పేదల కడుపు కొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.