ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
1 min read

ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు,ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు,జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
అనంతరం అధికారులతో సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు,ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు,జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లతో కలిసి జిల్లా కలెక్టరు పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిసెంబరు 01వ తేదీన (సోమవారం) ఉంగుటూరు మండలంలో యన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు పంపిణీ మరియు, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించు తారని, దీనితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. గ్రామంలో పెన్షన్లు పంపిణీ మరియు ఇతర కార్యక్రమాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, లబ్ధిదారులు గృహాలను ముందుగానే పరిశీలించి సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. బహిరంగ సభ, కార్యకర్తలు సమావేశంనకు అనువైన ప్రాంతాలను గుర్తించి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యటన అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసి,పర్యటన పూర్తయ్యే వరకు అధికారులకు కేటాయించిన పనులు పూర్తిచేసి, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, లబ్ధిదారులకు పథకాలు అమలు చేసే ప్రాంతాలలో ముఖ్యమంత్రి స్వయంగా గృహాలకు వెళ్లే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేసామని అన్నారు. జిల్లా కలెక్టరు వెంట జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ,ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఏఎస్పీలు నక్కా పూర్ణ చంద్రరావు, సుస్మిత, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఎస్పీ లు, తహశీల్దారు పూర్ణ చంద్రప్రసాదు, వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


