రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన శత్రువు అదే !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంలో సామాజిక మాధ్యమాలు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్‌టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. యుద్ధం అనివార్యమని స్పష్టమవుతుండటంతో సైనిక దళాల కదలికలను పసిగట్టడానికి వారు తక్షణం రంగంలోకి దిగారు. తమ జీవితాలు ఎలా ధ్వంసమవుతున్నాయో ప్రపంచానికి చూపడానికి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించసాగారు. అదే సమయంలో రష్యన్ ప్రభుత్వం సెన్సార్‌షిప్ పేరుతో మీడియాపై యుద్ధం ప్రకటించింది. అసలు యుద్ధం ఎలా పరిణమిస్తుందో గానీ, ఈరోజు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు.