NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందుకే అత్యాచారాలు జ‌రుగుతున్నాయి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిజాబ్ పై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహిళలు తమ అందాన్ని దాచుకోకపోవడం వల్లే అత్యాచారాలకు గురవుతారని జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు.‘‘ఇస్లాంలో హిజాబ్ అంటే పర్దా… మహిళల అందాన్ని దాచిపెట్టేందుకు.. హిజాబ్ ధరించనప్పుడు మహిళలు అత్యాచారానికి గురవుతారు.’’ అని జమీర్ చెప్పారు.‘‘అమ్మాయిలు పెద్దయ్యాక ముఖాన్ని హిజాబ్‌తో కప్పుకోవాలి లేదా అందాన్ని దాచుకోవడానికి పర్దా ధరించాలి. ప్రపంచంలోనే అత్యధిక అత్యాచార కేసులు నమోదవుతున్న దేశం భారత్‌ అని మీరు చూస్తున్నారు. కారణం ఏమిటి? అమ్మాయిలు తమ ముఖాలను కప్పి, అందాన్ని దాచుకోరు. హిజాబ్ మహిళల భద్రత కోసం, వారి అందాన్ని దాచుకోవడం కోసం. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు, కానీ మహిళలను రక్షించడానికి ఇది చాలా సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు, ‘‘అని అహ్మద్ వివరించారు.

                              

About Author