ఆ ఎమ్మెల్యే తల్లి ఇప్పటికీ స్వీపరే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆప్ ఎమ్మెల్యే లభ్ సింగ్ ఉగోక్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ పై గెలిచారు. కానీ ఆయన తల్లి మాత్రం ఓ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. కొడుకు ఎమ్మెల్యే అయినా తన పనిని మాత్రం వదలలేదు. ఆప్ ఎమ్మెల్యే లభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచే ఆయన తల్లి బల్దేవ్ కౌర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చన్నీపై లభ్ సింగ్ 37,550 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, శనివారం కూడా ఆయన తల్లి ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చి తన పని చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా ‘‘డబ్బు సంపాదించడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు నా కొడుకు ఏ స్థానంలో ఉన్నాడనేది అనవసరం. నా పనిని నేను వదులుకోను’’ అని సమాధానం ఇచ్చారు.