PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగ

1 min read

యస్. టి. యు. రాష్ట్ర కౌన్సిలర్ కొత్తపల్లి సత్యనారాయణ                                               

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: భారతీయుల సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించే పెద్ద పండుగ సంక్రాంతి అని ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొత్తపల్లి సత్యనారాయణ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగాపత్తికొండ మండలము దూదేకొండ గ్రామంలో మంగళవారం సిపిఐ  గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గ్రామంలోని మహిళలు ,ప్రజలు ఉత్సాహం తో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలు గా STU నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి,బలరాముడు, చంద్ర శేఖర్ వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన పద్మావతికి మొదటి  బహుమతి కింద 3016 రూపాయలను ప్రధానం చేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన మల్లేశ్వరికి   2016 రూ”లను బహూకరించారు. అలాగే తృతీయ స్థానంలో నిలిచిన సిరీషాకు 1016 రూ.లను,నాల్గవ బహుమతి కింద 516 రూ.లను రాధమ్మకు అందజేశారు.వీరితోపాటు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతుల కింద ఒక్కొక్కరికి 116 రూపాయలు,కుంకుమ బరిణ మరియు జాకెట్ పీస్ లను  ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో యస్ . టి.యు  . రాష్ట్ర నాయకులు కొత్తపల్లి సత్యనాాయణ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కుంపటి నరసింహులు,కోడం పెద్ద అంజినయ్య, కోలంట్ల పెద్ద రంగన్న, కోడం మోహన్,బురుకుల చిన్న అంజినయ్య,నేమకంటిరామాంజనేయులు, హెచ్. రంగన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author