ఆ ముప్పు తక్కువే !
1 min readపల్లెవెలుగువెబ్ : స్టాగ్‌ఫ్లేషన్ ముప్పును ఎదుర్కొనే విషయంలో ఇతర దేశాల కన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కమోడిటీ ధరలు భారీగా పెరిగిపోవడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్ల కారణంగా అస్థిరతలు పెరిగిపోయాయని తెలిపింది. జీడీపీలో భాగమైన పలు అంశాలు మహమ్మారి ముందు నాటి స్థాయిలకు చేరుకున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని, ఏడు నెలల పాటు నిర్విరామంగా పెరిగిన ద్రవ్యోల్బణం మే నెలలో కాస్తంత తగ్గి ఊరట ఇచ్చిందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న చర్యలు వృద్ధికి ఊతం ఇస్తూనే ధరలు స్థిరంగా ఉండేలా చూడాలన్న కేంద్ర బ్యాంకు వైఖరికి దర్పణం పడుతున్నట్టు తెలిపారు.