PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ స్వామి వ‌ల్ల సీఎం ప‌ద‌వికి ప్ర‌మాదం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిన్నజీయర్‌ స్వామి వల్ల కేసీఆర్‌ సీఎం పదవికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన సీపీఐ మహాసభకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా చిన్నజీయర్‌ తయారయ్యారన్నారు. సాధు జంతువుగా ఉన్న ఆయన రాజకీయ జంతువుగా మారాడన్నారు. కేసీఆర్‌కు, మోదీకి వచ్చిన విభేదాల్లో ఆయన పావుగా మారాడన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా లొసుగులు లేకుండా సీఎం కేసీఆర్‌ నిస్వార్ధంగా జాతీయ రాజకీయాలకు వెళితే స్వాగతిస్తామన్నారు.

                                          

About Author