అందుకే పీఆర్సీ పై మాట్లాడలేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలపడం బాధాకరమని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని వైకాపా హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఒకవైపు జీతాలు పెంచామని చెబుతూనే.. వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్పినందునే ఈ అంశం పై ఇప్పటి వరకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.