శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి 44వ వార్షిక జాతర మహోత్సవాలు..
1 min readభారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
కార్యక్రమాలను పర్యవేక్షించిన కమిటీ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొత్తపేట శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి 44 వ వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్బంగా ప్రతి యేడు సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వలపుల నూకరాజు నివాసం నుండి జాతర కార్యక్రమం కార్పొరేటర్లు జనపరెడ్డి కనక రాజేశ్వరి కృష్ణ, పొలిమేర రాందాసు, అర్జీ సత్యవతి నాగేశ్వరరావు, కమిటీ అధ్యక్షులు నక్క నాగేశ్వరరావు, గొంతిన రామకృష్ణ, మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 101 కలిశాలతో మహిళలు ఊరేగింపు బయలుదేరి కోలావారి వీది, ద్వారాపురెడ్డి వారి వీదీ, దాసరి ఎర్రయ్య వీధి, ఏ.కే.జీ. సెంటర్, పెద్దింటి వారి వీధి మొదలైన పుర వీదులలో ఊరేగింపుగా పాత వాటర్ ట్యాంక్ వెంకటేశ్వర స్వామికి దేవాలయం వద్ద పోతురాజు బాబు స్నానం చేయించారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు పల్లెల సత్యనారాయణ, వెల్లంకి రాజు, వలపుల బుజ్జి, బావిశెట్టి కేశవ, సంబంగి కిరణ్, ఎస్. శ్రీధర్, కోలా భాస్కర రావు, వందలాదిమంది భక్తులు, మహిళలు, యువతి,యువకులు పాల్గన్నారు.