జర్నలిస్టుపై దాడి చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి
1 min read– ఆర్డీవో వెంకటరెడ్డికిఏపీయుడబ్ల్యుజె వినతిపత్రం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో కోడుమూరు మండలం విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సతీష్ కుమార్ పై దాడి చేసిన నిందితుడు బలరాంను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీయుడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శనివారం బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద డోన్ ఆర్డీవో వెంకటరెడ్డికి, తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఇసుక తరలింపునకు సంబంధించిన న్యూస్ కవరేజ్ వెళ్లిన సతీష్ కుమార్ పై అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరుడు బలరాం దాడిచేయడం అమానవీయమని అన్నారు.దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతకు ముందు వారు స్థానిక పెట్రోల్ బంక్ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు.వినతి పత్రం అందజేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే బనగానపల్లె శాఖ కార్యనిర్వాహక సభ్యులు రామదాసు రెడ్డి (వార్త ఆర్సీ ఇంచార్జి) మదార్ (99టీవీ), హరికృష్ణారెడ్డి (విశాలాంధ్ర) యు.రాజశేఖర్ (గ్రామీణ వార్త),సుబ్బయ్య (వార్త రూరల్) ,రఘురామిరెడ్డి (ఆంధ్రప్రభ రూరల్)వెంకటరాముడు (ఈనాడు), వెంకటేశ్వర్లు (ఆంధ్ర జ్యోతి), మదన్ న్యూస్ ఛానల్ మదన్, షాశావాలి (స్వతంత్ర),మధు (నెనుసైతం), టీవీటీవీ55 సయ్యద్,10 టీవీ శ్రీకాంత్ , కిరణ్ (నవనంది) , పీఎం9 బాషా,జానకిరామ్( కిసాన్ మీడియా) వెంకట్రామిరెడ్డి , ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.