అడ్వకేట్స్ సవరణ బిల్లు – 2025 రాజ్యాంగ విరుద్ధం
1 min read
బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రంగస్వామి బిల్లు ను వ్యతిరేకిస్తూ పత్తికొండ లో న్యాయవాదుల ఆందోళన
పల్లెవెలుగు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన అడ్వకేట్స్ సవరణ బిల్లు -2025 ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, న్యాయవాదుల హక్కులకు భంగం కలిగిస్తోందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్ కుమార్, మైరాముడు, సత్యనారాయణ, మల్లికార్జున, కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వకేట్స్ సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ శుక్రవారం పత్తికొండ లో న్యాయవాదులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సవరణ బిల్లు పూర్తిగా అడ్వకేట్ల హక్కులను హరించే విధంగా ఉండడమే కాకుండా, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని తీసివేసే విధంగా ఉందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్లను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ, న్యాయ వ్యవస్థను నియంత్రించే ప్రయత్నంగా ఉందన్నారు. అడ్వకేట్స్ కోర్టులు బాయ్ కాట్ చేయడం, కోర్టు వర్కు చేయకుండా దూరంగా ఉండటం వంటివి చేయకూడదు అనే సవరణ సెక్షన్ – 35A పూర్తిగా అడ్వకేట్ల హక్కులకు భంగకరం మరియు ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. కాబట్టి ఈ సెక్షన్ ను తక్షణమే తొలగించాలన్నారు. అడ్వకేట్ల రక్షణకు ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా, ఈ సవరణ బిల్లు ద్వారా అడ్వకేట్లను పూర్తిగా నియంత్రించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకునే కుట్రలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అడ్వకేట్స్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన అభ్యంతరాలను కేంద్రానికి పంపిందన్నారు. సవరణ బిల్లు అమలు అయితే న్యాయవ్యవస్థ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. న్యాయవాదుల హక్కులను, న్యాయ వ్యవస్థ స్వతం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “అడ్వకేట్స్ సవరణ బిల్లు” – 2025 ను వ్యతిరేకిస్తూ పత్తికొండలో ఆందోళన చేస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, న్యాయవాదులు.