18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలి
1 min read
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
కర్నూలు, న్యూస్ నేడు: 18 సంవత్సరములు నిండిన యువత ఓటు నమోదు చేసుకునేలా చూడాలని పాణ్యం పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పాణ్యం నియోజకవర్గ పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 18సంవత్సరములు నిండిన యువత ను మరియు ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించి ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని పాణ్యం నియోజకవర్గ పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు పాణ్యం నియోజకవర్గంలో 1177 డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం జరిగిందన్నారు. దాదాపు 500 నూతన ఓటర్లను నమోదు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో 1200 ఓట్లు దాటి ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అదనముగా ఉన్న ఓటర్లను ఫార్మ్ 8 ద్వారా ఇతర పోలింగ్ స్టేషనులకు బదిలీ చేయడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్, జనవరి, మాసాలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వివాహం చేసుకొని వెళ్లిన మహిళలు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు తమ ఓటును బదిలీ చేసుకోవచ్చు అని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బిఎల్వోలు సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాలని, బి ఎల్ వో లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు వెరిఫికేషన్ జరిపి డూప్లికేట్ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలోని ట్రాన్స్ జెండర్స్ గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించాలని, జాయింట్ కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధి మంజునాథ్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి రామశేషయ్య, బిజెపి పార్టీ ప్రతినిధి నాగరాజు, సిపిఎం పార్టీ ప్రతినిధి రామకృష్ణ, ఐ ఎన్ సి పార్టీ ప్రతినిధి ఎస్ రజాక్ వల్లి, కల్లూరు తహశీల్దార్ ఆంజనేయులు, పాణ్యం తహశీల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి, గడివేముల తహశీల్దార్ వెంకటరమణ, ఓర్వకల్లు డిప్యూటీ తహశీల్దార్ రాజేష్, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ జి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
