వివాహ వయసు పెంచడంకాదు.. 33 శాతం రిజర్వేషన్ ఇవ్వండి !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కనీస వివాహ వయసు పెంచడం పై సీపీఐ సీనియర్ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీస వివాహ వయస్సు పెంచడం కాదని, చిత్తశుద్ధి ఉంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఆడపిల్లలు వారి ఇష్టప్రకారం వివాహం చేసుకోనివ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ అందించే దిశగా ప్రధాని మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ మూడు కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం నానా జిమ్మిక్కులు చేస్తున్నారని, అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు.