PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల సంక్షేమమే ధ్యేయం..

1 min read

– పథకాల అమలులో.. దేశంలోనే ప్రథమం..
– రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్
– కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్​ కింద 1.77 కోట్ల చెక్కుల పంపిణీ
పల్లెవెలుగువెబ్​, మహమూబ్​నగర్​: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్​ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురరువారం మహబూబ్​నగర్​ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 177 మంది ( కళ్యాణలక్ష్మి, షాదిముబారక్​) లబ్ధిదారులకు రూ. కోటి 77 లక్షల విలువైన చెక్కులను అర్హులైన పేదలకు అందజేశారు. కలెక్టర్​ ఎస్​. వెంకటరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో.. నియోజకవర్గ పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 24 లక్షల 27వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గతంలో పేద ఆడబిడ్డల పెళ్లికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్​ ఆడబిడ్డకు ఆసరాగా నిలిచి పెళ్లికి లక్షా 16వేలను కానుకగా అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందు లాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ kc నర్సింలు, కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


About Author