PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓపిఎస్ సాధనే లక్ష్యం.. :ఫ్యాప్టో

1 min read

ఉపాధ్యాయ,ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పల్లెవెలుగు: రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో కర్నూలు జిల్లా  ఫ్యాప్తో చైర్మన్  యస్. గోకారి  అధ్యక్షతన జరిన FAPTO జిల్లా  సదస్సు లో ఉపాధ్యాయ, ఉద్యోగ ,విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని  FAPTO కో  చైర్మన్ కే. ప్రకాష్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  జి.హృదయ రాజు ,సహెచ్ .తిమ్మన్న, సురేష్ గారు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు  రాష్ర్ట ఫ్యాప్టో కో ఛైర్మన్ మరియు ఆప్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు గారు మాట్లడుతూ ఫ్యాప్టో రాష్ర్ట ప్రభుత్వం సి పి ఎస్ స్థానం లో జి పి ఎస్ అనే విధానం ను బలవంతంగా ఉద్యోగుల పై రుద్దటానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి ఫ్యా ప్టో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు అని దాని కొరకు మండల స్థాయి నుండి రాష్ర్ట స్థాయి వరకు ఉద్యమాన్ని రూపొందించింది ,ఉపాధ్యాయ మరియు ఉద్యోగులకు తమ సమస్యలను తీర్చే సత్తా  ఫ్యాప్తో కు వుంది అనే నమ్మకం వుంది,ఆ నమ్మకం ను ఫాప్తో నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతుందని దానికి సహకరిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఫ్యాప్తో రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు మరియు ఎస్ టి యు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తిమ్మన్న మాట్లడుతూ ఏ పి జె ఏ సి యందు కూడా ఫ్యాప్తో సభ్య సంఘాలు ఉన్నాయి. అందుకే సి పి ఎస్ రద్దు చేసే విషయంలో ఫ్యాప్తో సంఘాల నిర్ణయమే ఏ పి జె ఏ సి నిర్ణయం గా వుంటుంది. ఎన్ ఈ పి అమలు చేయటం లో రాష్ర్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని దానిని ఫ్యాప్తో వ్యతిరేకిస్తుంది అని తెలిపారు.

ఫ్యాప్తో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏ పి టి ఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏ పి జె ఏ సి రాష్ర్ట సెక్రెటరీ జనరల్ హృదయ రాజు మాట్లడుతూ పి ఆర్ సి సమయంలో ఉద్యమాన్ని ఫ్యాప్తో ప్రారంభించి తదనంతరము ఏ పి జె ఏ సి లకు విడచి పెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు ఫ్యాప్తో నే ఉద్యమాన్ని నడుపుతుంది అని తెలిపారు.

యు టి ఎఫ్ రాష్ర్ట సహా అధ్యక్షుడు సురేష్ కుమార్ గారు మాట్లడుతూ విద్యా శాఖ ఉన్నత అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ గారు అర్దరాత్రి అధికారుల ను వెంట పెట్టుకొని విద్యార్ధుల ఇండ్లను సందర్శించి ప్రశ్నలు వేయటం, అంత మంది అదికారుల ను చూసి భయం తో వారు సమాధానం చెప్పలేక పోతే టీచర్స్ ను బలి పశువు లు గా చెస్తున్నారు. అయన తన పద్దతి మార్చుకోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి నాడు నేడు పనులు చేసిన టీచర్స్ త్యాగము ను అధికార్లు గుర్తించాలి అన్నారు.

ఫ్యాప్తో కర్నూలు జిల్లా సెక్రెటరీ జనరల్ తిమ్మప్ప గారు రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం లను అమలు చేయటం లో కర్నూలు జిల్లా ఎప్పుడూ ముందు వరుస లొ వుంటుంది అన్నారు. ఈ సదస్సు లో నంద్యాల జిల్లా ఫ్యాప్తో సెక్రెటరీ జనరల్ సుబ్బన్న, హెడ్మాస్టర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నారాయణ ఏ పి టి ఎఫ్ 257 రాష్ర్ట కార్యదర్శి రవికుమార్, డి టి ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి గొట్ల చంద్ర శేఖర,యు టి ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి శ్రీమతి నాగమణి, ఏ పి టి ఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి మరియానందం , బి టి ఎ రాష్ర్ట నాయకులు రామ శేషయ్య, బి టి ఎ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ప్రసంగించారు. కర్నూలు జిల్లా ఫ్యా ప్తో కోశాధికారి సేవా లాల్ నాయక్ వందన సమర్పణ తో సదస్సు ముగించిన ఉపాధ్యాయ సంఘాల సభ్యులు రాజ విహార్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో ఫ్యాప్తొ సభ్య సంఘాలు యు టి ఎఫ్ నుండి ఎల్లప్ప జయరాజు సుధాకర్ ఎస్ టి యు నుండి జనార్ధన్ ప్రసన్నరాజు నాగరాజు ఏ పి టి ఎఫ్ 257 నుండి రంగన్న నాగరాజు శివయ్య రామచంద్ర రెడ్డిఏ పి టి ఎఫ్ 1938నుండి ఇస్మాయిల్ మరి యానందం హెడ్మాస్టర్ అసోసియేషన్ నారాయణ డి టి ఎఫ్ నుండి కృష్ణ యస్ సి ఎస్ టి యు ఎస్ టి నుండి సాయిబాబా రుట మరియు అప్రితా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు ఇతర నాయకులూ పాల్గొన్నారు.

About Author