ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యం
1 min readఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పక్కీరప్ప
పల్లెవెలుగు, హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 58వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పక్కీరప్ప మాదిగ ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 28 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన మహా నేత మందా కృష్ణ మాదిగ అని, ఆయన నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టమన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు పోరాటం చేస్తామని, యువతరం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనెల 15న ఆదోనిలో జరుగు సన్నాహా సభకు మన మహాజన నేత మంద కృష్ణ మాదిగ హాజరు అవుతున్నారని, కనుక మండలంలో ఉండే ప్రతి మాదిగ బిడ్డ ఆదోనికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు బజారప్ప ఉల్లిగప్ప లక్ష్మన్న రాముడు హనుమంతు విద్యా కమిటీ వైస్ చైర్మన్ హుసేని జయప్ప హుసేని వాలంటరీ బీమప్ప ఎమ్ఎస్పీ నాయకులు చిన్న ఉల్లిగప్ప బుద్ధిరప్ప తిమ్మప్ప ఖాదరప్ప సాలప్ప వంకాయలు ఉసేనప్ప కుంటి నరసప్ప తాయప్ప మీసాలు షేక్ , మరియు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. విద్యార్థులు పాల్గొన్నారు.