విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
1 min read– ఎంఈఓ గంగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా వారిని బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంఈఓ గంగిరెడ్డి అన్నారు, బుధవారం తూర్పు హరిజనవాడ ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు, ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం అనేక పథకాలు తీసుకురావడమే కాకుండా వారి అభ్యున్నతికి ఎంతో తోడ్పాటును ఇవ్వడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా విద్యార్థులకు నాడు నేడు కింద పాఠశాల రూపురేఖలను మార్చడమే కాకుండా వారికి ఉచితంగా పుస్తకాలు, షూలు, యూనిఫామ్, తోపాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు, 2017లో ఈ పాఠశాలలో 17 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని నేడు పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు, మాపై ఎంతో నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు, మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయమని మీ పిల్లలకు మంచి విద్యను అందించడమే కాకుండా బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు, పాఠశాల చైర్మన్ రాజేశ్వరి, మాజీ చైర్మన్ నాగలక్ష్మి లు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మా పాఠశాలకు రావడం మా అదృష్టమని ఇటువంటి ఉపాధ్యాయులు ఉండటం వల్లనే ఇక్కడ చదివి వెళ్లిన 27 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగిందని గ్రామస్తులంతా కూడా ఉపాధ్యాయులను కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.