PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమాదాల నివారణే లక్ష్యంగా..

1 min read

– నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో ముగ్గురికి ఉత్తమ డ్రైవర్లుగా అవార్డు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉత్తమ డ్రైవర్లను సన్మానించడంతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం విలేకరులతో డిఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ నందికొట్కూరు ఆర్టీసీ డిపో కు చెందిన ముగ్గురు డ్రైవర్లకు విజేయుడు, బీఆర్కే రెడ్డి, లక్ష్మన్న కు అవార్డు దక్కిందన్నారు.ఉత్తమ డ్రైవర్లకు నంద్యాల జిల్లా కేంద్రంలో 34వ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రైవర్లను సన్మానించారన్నారు. ఈ సమావేశానికి నంద్యాల డిఎస్పీ మహేశ్వర రెడ్డి,ఆర్టీఓ శ్రీకాంత్, ఆర్. ఎం. శ్రీనివాసులు, నంద్యాల డిపో మేనేజర్ గంగాధర రావు లు ముఖ్యఅతిథిగా హాజరై అవార్డు గ్రహీత లను సన్మానించారన్నారు . ప్రశంసా పత్రం, నగదు పురస్కారం అందించారన్నారు. డ్రైవర్లు బస్సులు నడపడంలో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని, ఇతర పలు సూచనలు అందించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడంతోపాటు డ్రైవరు, కండక్టరు కూడా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. పలువురు డ్రైవర్లు దశాబ్దాలుగా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా బస్సులు నడుపుతున్నారని తెలిపారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు భవిష్యత్‌లో మరింతగా రాణించి సంస్థ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ప్రశాంతతోనే ప్రయాణం సురక్షితం..ఎం. విజేయుడు. డ్రైవర్.
నేను ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో 30
ఏళ్లుగా డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నా. సుదీర్ఘ ప్రయాణంలో ఒక్క ప్రమాదం కూడా చేయలేదు. ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు ప్రమాద రహిత విభాగంలో అవార్డులు అందుకున్నా. బస్సు ఎక్కే సమయంలో మానసికంగా ప్రశాంతతో సన్నద్ధ మవుతా. ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వారి కుటుంబాల భద్రత డ్రైవరుపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

About Author