పర్యావరణ పరిరక్షణే ధ్యేయం …
1 min read– వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం..
– జూన్ 5న మేరీలైఫ్ – మేరా స్వచ్ఛ షహార్…
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మేరీలైఫ్ – మేరా స్వచ్ఛ షహార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన లోగోను శుక్రవారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులను నా ప్రవర్తనలో చేసుకుంటానని కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నాకుటుంబం, స్నేహితులు, ఇతరులకు నిరంతరం ప్రేరేపించడానికి కూడా నేను కట్టుబడివున్నానని ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరి జీవనశైలిలో మార్పు రావాలన్నారు. సింగిల్ యూడ్ ప్లాస్టిక్ ను తగ్గించడం, ఆర్యోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. రెడ్యూస్ – రీసైకిల్ రీయూజ్ నిధానంతో చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలు తమవంతు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జిఎస్ డబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసరు రమణ, పలువురు గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.