కార్పొరేట్ వైద్య సేవలను సామాన్యులకు సైతం అందించడమే మాధ్యేయం
1 min read
డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్
పల్లెవెలుగు ,విజయవాడ : కార్పోరేట్ వైధ్య సేవలను అతి తక్కువ ఖర్చులతో సామ్యాన్యుడికి సైతం అందించాలనే లక్ష్యంతో శ్రీభవాని మల్టీస్పెషాలిటి హస్పటల్ ను ప్రారంభించామని డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ అన్నారు. శనివారం విజయవాడ భవానిపురం లోని స్వాతి థియేటర్ సమీపంలోని నాగార్జున వీధిలో ఉచిత మధుమేహ వ్యాధి శిబిరం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూశ్రీ భవాని హస్పటల్ నందు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని అన్నారు. అనుభజ్ఞలైన డాక్టర్ల బృందం 365 రోజులు 24గంటలు అందుబాటులో ఉంటారన్నారు. శ్రీభవాని హస్పటల్ నందు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉచిత మధుమేహ వ్యాధి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఈ నెల 15 నుండి పది రోజులు పాటు నిర్వహించే ఉచిత మెగా డయాబెటిక్ నందు రూ 2000 విలువచేసే వివిధ రకాల రక్త పరీక్షలు, ఇతర స్క్రీనింగ్ పరిక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.డాక్టర్ భారతి. నెఫ్రాలజిస్ట్,రీనల్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్ మాట్లాడుతూ జబ్బు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమనీ ఆమే అన్నారు. భవానిపురం నందు మొట్టమొదటిసారిగా క్యాత్ ల్యాబ్, డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ తమదేనని,కఅదే విధంగా ప్రతి మంగళవారం,శుక్రవారం ఆసుపత్రి నందు డయాబెటాలజి మరియు ఆర్దో చెకప్ కోసం ఉచిత ఓపి సేవలు, ఇన్యురెన్స్ సౌకర్యం ఉన్నవారికి ఆపరేషన్లు చేయనున్నామని, విజన్ 2025 పేరుతొ భవానీపురం ప్రాంత పేద మధ్యతరగతి ప్రజలకి నమ్మకమైన, నాణ్యత తో కూడిన వైద్యాన్ని అందుబాటు ధరలలో ప్రజలకు అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు, అనంతరం శ్రీ భవాని మల్టీస్పెషాలిటీ హస్పటల్ ఛీఫ్ ఆడ్మీనిస్ట్రేటర్ డాక్టర్ ఎన్.పి.దిలీప్ మాట్లాడుతూ కార్పొరేట్ హస్పటల్ కి వెళితే ఖర్చులు ఏక్కవ ఖర్చులు అవుతాయని భవిస్తున్నారని వారి భయాన్ని పారదోలటానికి ఈ ఉచిత డయాబెటిస్ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వెయ్యి రుపాయల్లోనే బ్లడ్ టెస్ట్ లు,4999 రుపాలయలకే సిటి యాంజియోగ్రామ్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు, అన్ని రకాల క్యాష్ లెస్ సేవలు, ఈఎస్ఐ వంటివి త్వరలోహెల్త్ ఇన్సురెన్స్ గవర్నమెంట్ ఉద్యోగులకు రీయింబర్స్ మెంట్ సౌకర్యం ఉందని తెలిపారు.అనంతరం డాక్టర్ వెన్న వేంకట రాధా గోపాల్ బ్రోచర్ జనరల్ మెడిసిన్ డయాబెటిక్ స్పెషలిస్ట్ బ్రోచర్ ను విడుదల చేసి రోగులను పరిక్షించారు.ఈ కార్యక్రమంలో హస్పటల్ ల్యాబ్ టెక్నిషియన్స్, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.