PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.. : ఎంపీ శ్రీధర్​

1 min read

పల్లెవెలుగు,ఏలూరు: హ్యూమన్ హెయిర్  ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్ పోర్టర్స్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేయాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు  కోటగిరి శ్రీధర్  కోరారు.శనివారం  ఏలూరు ఆర్.ఆర్ ఆర్ పేట లోని  ఆకర్ష్ ప్రైడ్ లో  హ్యూమన్ హెయిర్ ఎక్స్ పోర్టర్స్,మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ  కోటగిరి శ్రీధర్ కి ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా  ఎంపీ  మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అయ్యే హ్యూమన్ హెయిర్ ( జుట్టు, విగ్గు)ను 99 శాతం ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తుంటారని అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఎగుమతులపై నిలుపుదల చేశారు. దీంతో అప్పటి నుంచి ఎగతులు ఆగిపోయాయి. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ లో నుంచి సుమారు 8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని అన్నారు.అంతేకాకుండా దేశానికి వచ్చే ఆదాయం 30,40 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.ఈ విషయంపై  రెండు సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ బ్యాన్ ఎత్తి వేయాలని కేంద్ర మంత్రులను కలిసి అనేక సార్లు వివరించడం జరిగిందని ఆయన అన్నారు. గత ఆగస్టులో ఈ విషయంపై పార్లమెంట్లో లో చర్చించడం జరిగిందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,  ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ,పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఉత్పత్తులు నిలుపుదల వల్ల జరిగే నష్టాలు విపులంగా వివరించడం జరిగింది. ఈ పోరాటం వల్ల అటు ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు స్పందించి ఎగుమతులు పై నిషేధాజ్ఞలను ఎత్తివేయడం జరిగిందని అన్నారు. హ్యూమన్ హెయిర్ ( జుట్టు, విగ్గు)ను విదేశాలకు ఎగుమతులు జరిగే విధంగా, కోల్పోయిన 8 లక్షల మంది కి ఉద్యోగాలను తక్షణమే తిరిగి తీసుకునేందుకు మార్గం సుగమం అయిందని,  అదనంగా దేశవ్యాప్తంగా మరో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన తెలిపారు.  హ్యూమన్  హెయిర్  ఎక్స్పోర్ట్ పై ఉన్న నిషేధాజ్ఞలు తొలగించడానికి ఏలూరు ఎంపీ  కోటగిరి శ్రీధర్  ఎంతో కృషి చేశారని, ఆయన వల్లే ఇది రావడం జరిగిందని అన్నారు. ఎగుమతులు ప్రోత్సాహిచడం  వల్ల వెంట్రుకల వ్యాపారస్తులు,  ఎక్స పోర్ట్ దారులకు మంచి జరుగుతుందని అన్నారు.   ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు.దేశంలోనే వెంట్రుకలకు వాల్యూ ఎడిషన్  చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం దేశానికి వస్తుందని ఆయన తెలిపారు.హ్యూమన్ హెయిర్ ఉత్పత్తిదారులు  ,ఎక్స్ పోర్ట్  దారుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ కేకే గుప్తా ,ఎక్స్ పోర్టర్  వంకా రఘువీర్,మాదే పల్లి అసోసియేషన్ నుంచి పివి రావు తదితరులు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్  హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ తొలగించేందుకు చేసిన కృషిని  వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో  హ్యూమన్ హెయిర్ ఉత్పత్తిదారులు  ,ఎక్స్ ఫోర్ టర్స్ , వివిధ అసోసియేషన్స్ నాయకులు, పలువురు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author