పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
1 min read– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సోమలరాజు జనార్ధనరాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పట్టభద్రుల సమస్యల పరిష్కా రమే తమ లక్ష్యం ని పశ్చిమ రాయలసీమ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా సోములరాజు జనార్ధనరాజు అన్నారు. శనివారం స్థానిక డైట్ కళాశాలలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలు పరి ష్కారం కావాలన్నా, శాసనమండలిలో వారి సమస్యలపై గళం వినిపించాలన్నా తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మొదటి ప్రాధా న్యతా ఓటు వేసి గెలిపించాలని ఆయన ఉ ద్యోగులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, పట్ట భద్రులు, మేధావులకు సూచించారు. పట్ట భద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు. పట్టభద్రు లకు విద్య, ఉ పాధి అవకాశాలు పెంపొందించేందుకు, స్వయం ఉపాధి వ్యక్తులుగా ఎదిగేందుకు తాను పాటుపడతానని తెలిపారు. ప్రతి విభాగంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తాన న్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కూడా రద్దు చేసి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేకుండా పట్టభద్రులకు జగన్ అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థను నిర్వీర్యమైపోయిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఉపాధికల్పన కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రైవే టు, ప్రభుత్వ సెక్టార్లలో ఉద్యోగ భర్తీలు చేయాల న్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టాన్ని కలిగించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసి రాబోవు పీఆర్సీలో అందరికీ ఆమోదయోగ్యమైన మంచి ఫిట్మెంట్ సాధించేందుకు పోరాటం చేస్తా నన్నారు. గతంలో తను కూడా జర్నలిస్టుగా పనిచేశానన్నారు.రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, పింఛను, మెరుగైన వైద్యసదుపా యాలు కల్పించి ఇళ్ళస్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ ,కార్మిక సమస్యలు పెరిగిపోయాయి అన్నారు. కావున ఈ సమస్యలనుపరిష్కరించాలంటే ఈ నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిత్యం అందుబాటులో వుంటూ యువత. విద్యావంతుల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.