పార్టీ బలోపేతమే లక్ష్యం.. :చిరంజీవి రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ కర్నూలు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి. ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు లోని తులజా భవాని కల్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కర్నూల్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు పార్టీ లోని ప్రతీ పాదాధికారులు, శక్తి కేంద్ర ఇంచార్జులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు కృషి చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే విధంగా పనిచేయాలని సూచనలు చేశారు. మరియు ప్రతి గ్రామంలో గడప గడపకు పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయాలనీ వివరించారు. ప్రతి నెలలో చివరి ఆదివారం మనకి బాత్ కార్యక్రమం టీవీలో దూరదర్శన్ ఛానెల్లో అన్ని గ్రామాల ప్రజలు వీక్షించే విధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కర్నూల్ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి, జిల్లా లోని నాయకులు , అన్ని మండల నాయకులు పాల్గొని విజవంతం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాద్యక్షులు చంద్రమౌలి,రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ , జిల్లా ప్రధానకార్యదర్శి అంబలి కాశీ విశ్వనాథ్, కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జి మీసాల ప్రేమ్ కుమార్ మరియు కోడుమూరు మండలం అద్యక్షులు సల్వాడి సురేంద్ర పాల్గొన్నారు.