ప్రతి గ్రామానికి బడిని ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
1 min read– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలని విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదని కమలాపురం శాసనసభ్యులు పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శనివారం మండలంలోని కనపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని కైలాసగిరి యానాది ఎస్టీ కాలనీలో నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను స్థానిక శాసనసభ్యులు పోచిమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గుడి బడి ఉన్నప్పుడే ఆ గ్రామం పురోగతి చెందుతుందని ప్రతి విద్యార్థికి అక్షర జ్ఞానం ముఖ్యమని ఆయన తెలియజేశారు, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ తమ బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లికి వారి పేదరికం అడ్డు కారాదని అమ్మబడి అనే పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యా కానుక ద్వారా బడిలో చేరిన మొదటి రోజే విద్యార్థులకు బుక్స్ ,బ్యాగు ,బెల్టు మొదలగు వస్తువులు ఇస్తున్నారని ఆయన తెలియజేశారు, అదేవిధంగా జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పోషకలతో కూడిన మెనూ అమలు చేస్తున్నారని 6 నుంచి 14 సంవత్సరాలు వయస్సు గల విద్యార్థులు అందరూ బడిలో ఉండాలని బడిబయట ఉండరాదని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో విద్యార్థులకు అందుబాటులో పాఠశాలను ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సదుపాయాలను అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన అక్కడివారికి తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు అందరు బడిలో చేరిపించడమే సమగ్ర శిక్ష ప్రాజెక్టు ముఖ్యదేయమని ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతిస్తూ వేలాది కోట్ల రూపాయలతో మనబడి నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారుస్తూ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని, రానున్న కాలంలో విద్యార్థులకు విధ్య జ్ఞానం కు మించిన ఆస్తి మరొకటి లేదని విద్యాసంస్కరణలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు, కైలాసగిరి కోనలో 23 మంది డ్రాప్ అవుట్స్ పిల్లలను గుర్తించడం జరిగిందని, వారు బడిలో ఉండాలనే లక్ష్యంతో ఇక్కడనే ఒక ప్రైవేట్ భవనంలో పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా విద్యార్థులకు పార్టీ పుస్తకాలతో పాటు అని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, నాయకులు పల్లె కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఆర్ ఎస్ ఆర్, పి సి కేశవరెడ్డి, సర్పంచులు, సొంతం నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఘురామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, స్వచ్ఛంద సేవకురాలు దాడిరెడ్డి భాగ్యమ్మ స్థానిక మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి,సునీత, సమగ్ర శిక్ష ప్రాజెక్టు సెక్టోరియల్ అధికారులు మిట్టా కేశవరెడ్డి, దశరధరామిరెడ్డి,, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.