PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

1 min read

– ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, గురువారం ఆయన స్థానిక భారతి హై స్కూల్ నందు సర్పంచి సిద్దిగారి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నడవలేనివారు, వృద్ధులు, అన్ని రకాల వయసు మళ్ళిన వారికి, అలాగే దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు, ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న నినాదంతో ప్రజల వద్దకే వెళ్లి అక్కడే వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు, ఆరోగ్య సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్లు, అందరూ సమన్వయంతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వారికి అక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు, ఈ సందర్భం,గా ఆయన వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి వారి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లను ఓకే చోటికి తీసుకురావడం జరిగిందని దీని ద్వారా ప్రతి ఒక్కరికి సులభంగా వైద్య సదుపాయం అందేలా చూడడం జరిగిందన్నారు, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నేడు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం స్పందించడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ అలాగే ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాళ్లను ఆయన పరిశీలించారు, అనంతరం అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు ఏర్పాటు చేశారు, ఈ వైద్య శిబిరంలో 63 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది, మరో 6 మందికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది, ఈ వైద్య శిబిరంలో 550 మందికి డాక్టర్ బి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైయస్సార్సీపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైయస్సార్సీపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచులు, ముమ్మడి సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి యువ నాయకులు గొర్ల పుల్లయ్య గారి శివారెడ్డి, పేరు సామూల నిత్య పూజ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author