పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే వైసిపి లక్ష్యం..
1 min readఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఇళ్ల పట్టాల పంపిణీ గడివేములలో బుధవారం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. మండలంలో 8 గ్రామాలకు గాను బుధవారం నాడు1631 పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలను రిజిస్టర్ చేసి ఇస్తున్నారని, రిజిస్టర్ అయిన పట్టాలు మహిళలు తమ అవసరాలను బట్టి బ్యాంకులో తనఖా పేట్టి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంటుందన్నారు. ఇచ్చిన పట్టాలను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చాక హామీలను మరిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో ఎన్నికల సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని నెరవేర్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల క్రింద ఏవైతే పథకాలు చెప్పారో అక్క చెల్లెళ్లకు ఆసరా, 0 వడ్డీ, 40 సంవత్సరాలు పైబడిన వారికి చేయూత, అమ్మ ఒడి, పై చదువులు చదువుకునేందుకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాడు నేడు పనుల కింద ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చారన్నారు, కాన్వెంట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి బటన్ నొక్కి 70 వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం కరువుకాటకాలతో అల్లాడిదని, జగన్ పరిపాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉందని, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ నాగమద్దమ్మ, ఎంపీడీవో శివరాం రెడ్డి, తహసిల్దార్ జమానుల్లా ఖాన్, డిప్యూటీ తహసిల్దార్ గురునాథం, మండల వైసిపి అధ్యక్షుడు వై శివరామిరెడ్డి, గడివేముల ఉప సర్పంచ్ బాల చె న్ని,మండల వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి శిరుప శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, చిందుకూరు వెంకటకృష్ణారెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, కరిమద్దెల పుల్లయ్య, హుస్సేన్ భాష, డాలు స్వామి, సొసైటీ చైర్మన్ పోగుల చంద్రశేఖర్ రెడ్డి, దేశం నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.