బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి ప్రతి మంగళవారం మరియు అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహిస్తారు. మంగళవారం శ్రీశైలక్షేత్రపాలకుడు బయలువీర భద్ర స్వామికి ఆగమసంప్రదాయం ప్రకారం విశేష పూజలు చేశారు. క్షేత్ర పాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.