NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర

1 min read


పల్లెవెలుగు వెబ్: వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర‌కు క‌స‌రత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న ఖాళీల‌తో పాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టుల భ‌ర్తీ చేయాల‌ని భావిస్తోంది. మొత్తం 10,865 పోస్టుల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7,390 ఉద్యోగాల‌తో పాటు.. కొత్తగా సృష్టించిన 3,475 ఉద్యోగాలు ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన‌ ప‌రిష‌త్, డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ పరిధిలోని 15 వైద్య కళాశాలలు, వీటికి అనుబంధంగా ఉన్న 35 ఆస్పత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉండగా 2,190 పోస్టులు సృష్టించారు. ఏపీవీవీపీ పరిధిలో 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో 2,918 పోస్టులు ఖాళీగా ఉండగా 1,285 పోస్టులు సృష్టించారు.

About Author