NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు మినిమ‌మ్ పే స్కేల్ వ‌ర్తింప చేయాల‌ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖ‌లు, మోడ‌ల్ స్కూల్లు, యూనివ‌ర్శీటీలు, కేజీబీవీ, సొసైటీల్లో ప‌ని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు మినిమ‌మ్ పే స్కేల్ వ‌ర్తించ‌నుంది. వీరిలో క‌న్సల్టెంట్లు, స‌ల‌హాదారులు, ఓఎస్డీల‌కు మినిమ‌మ్ పే స్కేల్ వ‌ర్తించ‌ద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగుల‌కు 180 రోజుల మెట‌ర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రమాదంలో మ‌ర‌ణించిన కాంట్రాక్ట్ ఉద్యోగికి 5 ల‌క్షలు, స‌హ‌జ మ‌ర‌ణానికి 2 ల‌క్షల స‌హాయం అందించేందుకు ప్రభుత్వం అంగీక‌రించింది. ఈ నిర్ణయాల వ‌ల్ల ప్రభుత్వం మీద 365 కోట్ల భారం ప‌డ‌నుంది.

About Author