ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్ణయంపై వెనకడుగు వేసింది. కాసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అత్యవసరంగా క్యాబినెట్ భేటీ అయింది. మూడు రాజధానుల బిల్లు రద్దుకు క్యాబినెట్ ఆమోదించింది. ఇదే అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. మరోవైపు రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసానికి ఇందుకు సంబంధించిన వివరాలను ఏజీ వెల్లడించారు. కాగా, ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగించాలని అక్కడి రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.