PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డా జి సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నాణ్యత గా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా జి సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్వో నాగేశ్వర రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు సుదూర ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమానికి వస్తుంటారని వారికి న్యాయం జరిగేలా ప్రతి అధికారి శ్రద్ధతో వారు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. స్పందనలో అర్జీలు సమర్పించే అర్జీదారులు మొదటగా కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనంతరం ఆ దరఖాస్తును సమర్పించవలసి ఉంటుందన్నారు దరఖాస్తుదారులు అర్జీలు రిజిస్టర్ చేయించుకునే సమయంలో కంప్యూటర్ ఆపరేటర్స్ సక్రమంగా రిజిస్టర్ చేయడం లేదని గ్రీవెన్స్ ఏ అధికారికి సంబంధించింది అన్న విషయాన్ని క్లియర్ గా రిజిస్టర్ చేయడం లేదు ఇలా తప్పుడు మ్యాపింగ్ ఇచ్చే కంప్యూటర్ల ఆపరేటర్ల పై చట్టపరమైన చర్యలు తప్పవని కంప్యూటర్ ఆపరేటర్లను హెచ్చరించారు.కలెక్టరేట్ సముదాయంలోని అన్ని డిపార్ట్మెంట్స్ వారు వారి వారి కార్యాలయం వద్ద శుభ్రంగా ఉంచుకోవాలని గతంలో నే హెచ్చరించామని కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ వారు అపరిశుభ్రంగానే ఉంచుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పురపాలక శాఖ వారు కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని పరిశీలించాలని అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాలపై ఫైన్ విధించాలని పురపాలక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలోని అన్ని డిపార్ట్మెంట్ల కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ నాగేశ్వరరావు ను కలెక్టర్ ఆదేశించారు ఈకార్యక్రమంలో  జిల్లా,మండల స్థాయి అధికారులు  పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో కొన్ని విన్నతులుకృష్ణగిరి మండలం కంబలపాడు గ్రామ పంచాయితీ లోని బలపదొడి గ్రామనివాసి గొల్ల ఎల్లమ్మ, నాకు సర్వే నంబర్488/3c లో ఒక ఎకరా ఇరవై సెంట్ల భూమి కలదు పొరపాటున ఇతరుల పేరును ఆన్లైన్లో నమోదు చేశారు వారి పేరును తొలగించి నా పేరు నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని గాంధీనగర్ నివాసి బోయ లక్ష్మమ్మ నాకు ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామ పొలిమేరలో సర్వేనెంబర్ 96/2P లో ఒక ఎకరా భూమి కలదు భూమి వివరాలు నా పేరు ఆన్లైన్లో నమోదు కాలేదు ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.కోసిగి మండల కేంద్ర నివాసి అల్లమ్మ నాకు సర్వే నెంబర్ 200/B -253 లో 0.31 సెంట్ల భూమి కలదు ఇది మా పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.మద్దికేర మండల కేంద్ర నివాసి బంతి శ్రీనివాసులు నాకు మద్దికేర మండలం హోసూర్ గ్రామ పొలిమేరలో సర్వేనెంబర్ 536/1 లో 54సెంట్లు భూమి కలదు నా భూమిని గ్రామంలోని కొందరు వ్యక్తులు దౌర్జన్యంతో ఆక్రమించుకుంటున్నారు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

About Author