టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు దుర్మార్గం
1 min read– మండల ఐటీడీపీ ఛాంపియన్ యామలా మణికంఠ…..
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. చెన్నూరు లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ జగన్ ప్రభుత్వ సైకో చర్యలకు పరాకాష్ట రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడిచేతిలో రాయిగా మారింది అన్నారు, రాబోయే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదనేది తెలిసే సీఎం జగన్మోహన రెడ్డి బరితెగించాడు,చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డే భారత ప్రజాస్వామ్యానికే దుర్దినం 14ఏళ్లు సీఎంగా మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసుపెట్టి అరెస్ట్ చేయడం జగన్ సైకో చర్య,అక్రమంగా ఎఫ్ ఐ ఆర్ లో చంద్రబాబు పేరు లేకపోయినా ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసం అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం,జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు,చంద్రబాబు ను ఒకరోజైనా జైల్లో పెట్టాలనే జగన్ దుర్బుద్ధి,అరెస్టు చేసి చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలన్న ,జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది,నాలుగున్నర సంవత్సరాలనుండి ఒక్క అవినీతి నిరూపించలేక ఎలాగైన చంద్రబాబును జైలుకు పంపాలన్న జగన్ ను ప్రజలే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు అని ఆయన అన్నారు.