NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘కృష్ణా ’తో అనుబంధం మరువలేనిది

1 min read

–కలెక్టర్ ఇంతియాజ్

సహకరించిన మీడియా, అధికారులకు ధన్యవాదాలు
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ : రెండు సంవత్సరాల నాలుగు నెలల పని కాలంలో ఎంతో సంతృప్తిగా కృష్ణా జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించానని, వరదలు,పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పంచాయతీ ఎన్నికలు కరోనా ఉద్ధృతి లాంటివి ఉన్న సమయంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు సేవలు అందించామన్నారు. ఇలాంటి సమయాలో పాత్రికేయులు అందించిన సహకారం, ఈ జిల్లాతో ఉన్న అనుబంధం మరువలేనిది అని ఇంతియాజ్ అన్నారు. మచిలీపట్నంలో సోమవారం కలెక్టరేట్​ హాల్​ కలెక్టర్​ ఇంతియాజ్​ బదిలీ సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ ఇంతియాజ్​ను కలెక్టరేట్​ సిబ్బంది, ఎన్జీఓ నాయకులు, మచిలీపట్నం పాత్రికేయులు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చందమామ బాబు, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు అంబటి శేషుబాబు, సీనియర్ పాత్రికేయుడు ముదిగొండ శాస్త్రి, ఏపీయూడబ్ల్యూజే పట్టణ అధ్యక్షులు చలమలశెట్టి రమేష్ బాబు, బి కృష్ణ చైతన్య, పి. జాషువా, కే రాజేంద్ర ప్రసాద్ సునీల్, యమ్.ఏ. కౌసర్, షేక్ షరీఫ్, శ్రీనివాస్, ఏ. రమణ, కె. గణేష్ కుమార్ బి. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

About Author