NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చట్ట సభల్లోనే దాడులు సిగ్గుచేటు

1 min read

– వెల్లంపల్లి ప్రజలకు పనికిరాడు.. పనికిరాని పనుల్లో ముందుంటాడు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : నాగేంద్ర ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమాత్రం పనికిరాని మాజీ మంత్రి Velampalli Srinivasa Rao , పనికిమాలిన పనుల్లో మాత్రం ముందుంటాడు. చట్ట సభలోనే సీనియర్ సభ్యుడు, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి దాడి దుర్మార్గం. వెల్లంపల్లి శ్రీనివాస్ దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడంతో ఆర్య వైశ్యుల ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు. ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన నల్ల జీవోని రద్దు చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తుంటే 70ఏళ్ల వ్యక్తిపై వెల్లంపల్లి శ్రీనివాస్ దాడికి పాల్పడడం సిగ్గుచేటు. వెల్లంపల్లి బుద్ధి రాహిత్యానికి ఈ దాడి నిదర్శనం. చట్ట సభల ప్రతిష్టకు భంగం కలిగించిన వెల్లంపల్లికి క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తిరుగబాటుతో వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది. ఫ్రష్టేషన్ పీక్స్‌కు చేరింది. అందుకే సభ్యులపై దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. చట్ట సభల ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి మచ్చలా తయారయ్యారు. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న వైసీపీని రాష్ట్రం నుండి ప్రజలు తరిమి కొట్టడం తధ్యం.

About Author