NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడ‌లి త‌ల న‌రికిన అత్త‌.. నేరుగా పోలీస్ స్టేష‌న్ కు.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అన్న‌మ‌య్య జిల్లాలోని రాయ‌చోటిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ అత్త.. తన కోడలి తల నరకడం సంచలనంగా మారింది. అనంతరం తలపట్టుకుని పోలీసు స్టేష్టన్‌కు వెళ్లడం కలకలం సృష్టించింది. రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. కత్తితో తన కోడలి తల నరికింది. అనంతరం వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కాగా, కవర్‌లో ఉన్న వసుంధర తలను చూసి పోలీసులు షాకయ్యారు.ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాల ప్రకారం.. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో, ఆమె పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, భర్త మరణానంతరం ఆస్తులు అన్ని వసుంధర పేరు మీదకు బదిలీ అయ్యాయి. దీంతో, వసుంధర ఆస్తులను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి రాసివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. దీంతో, వసుంధర భర్త తమ్ముడు చందు, ఆమె చిన్నత్త సుబ్బమ్మ కలిసి వసుంధరను హత్య చేయాలని ప్లాన్‌ చేశారు. అందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం వసుంధర తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం, పట్టణంలో పట్టపగలే సుబ్బమ్మ ఇలా తల పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది.

                                        

About Author