PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని ప్రాంత అభివృద్ధికి అధికారులు ప్రణాళిక రూపొందించాలి

1 min read

– త్వరలో ఈ అంశంపై ముఖ్యమంత్రి సమావేశం
– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదోని ప్రాంత అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, త్వరలో ఈ అంశంపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అంశంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తయారు చేయాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.. ఆదోని ప్రాంతానికి సంబంధించిన అన్ని మండలాలు, నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేలా పూర్తి వివరాలతో గాజులదిన్నె రిజర్వాయర్, పందికోన రిజర్వాయర్, పులికనుమ రిజర్వాయర్ల నుండి నీటిని తీసుకుని తాగునీటి ప్రాజెక్టుల నివేదికను రూపొందించాలని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ ని ఆదేశించారు.. ఈ అంశంలో ఇరిగేషన్ ఇంజనీర్ల నుండి కూడా వివరాలు తీసుకుని పొందుపరచాలని కలెక్టర్ సూచించారు.వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుత పంటల విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఉత్పత్తులతో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా నూతన విధానాలను అమలు చేసేలా నివేదిక ను రూపొందించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మికి సూచించారు.అలాగే బీడు భూములు, సాగులో లేని భూములను సాగులోకి తీసుకొచ్చే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాము నివేదికలో రూపొందించాలన్నారు అలాగే వేరుశనగ, మిల్లెట్ల మిశ్రమ పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.బనవాసిలో ఫాడ ర్ రీసెర్చ్ మరియు ప్రొడక్షన్ స్టేషన్ ఏర్పాటు తో పాటు ఆదోని,ఎమ్మిగనూరులో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా నివేదికలో రూపొందించాలని పశుసంవర్ధక శాఖ అధికారి రామచంద్రయ్యను ఆదేశించారు.. అలాగే ఎక్కువ టమోటా ఎక్కువగా పండించే ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ ఏర్పాటు ప్రతిపాదనలతో నివేదికను రూపొందించాలని ఏపీఎంఐపి పిడి ఉమాదేవిని ఆదేశించారు..పెద్ద ఎత్తున తక్కువ ధరతో ఉల్లి స్టోరేజ్ యూనిట్ ల ఏర్పాటుకు సంబంధించి కూడా నివేదికలో రూపొందించాలని కలెక్టర్ సూచించారు.తుంగభద్ర నది పరివాహక మండలాల్లో పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును అమలుకు ప్రతిపాదనలు రూపొన్దించాలని, ఇందుకోసం ఉపాధి హామీ కింద సబ్ సర్ఫేస్ పాండ్స్ నిర్మాణానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ప్రతిపాదనలు రూపొందించాలని డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డికి సూచించారు.. ఫిష్ పాండ్స్,సెరికల్చర్, ఫ్లోరి కల్చర్ తదితర అంశాలకు సంబంధించి కూడా నివేదికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఆదోని ప్రాంతంలోని అన్ని విద్యా,వైద్య, సంస్థలు,సంక్షేమ శాఖలకు సంబంధించిన భవనాలను నాడు నేడు రెండవ దశ కింద చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని విద్యా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.. మహిళా, శిశు ఆరోగ్యం పై జిల్లాలో తీసుకుంటున్న చర్యలను నివేదికలో రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు శిశువులు,గర్భవతులు, 19 నుండి 45 ఏళ్ల మహిళలకు వైద్య సేవలు, రక్తహీనత నివారణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే సస్తే నప్పుడు డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి క్షేత్రస్థాయిలో పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు..స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను మంత్రాలయంలో ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో సిపిఓ అప్పలకొండ, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, ఐసిడిఎస్ పిడి కేఎల్ఆర్ కె కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author