PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు సమస్యలపై వెంటనే పరిష్కార మార్గం చూపాలి

1 min read

– మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : వాలంటీర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే స్పందన కార్యక్రమమే ఉండదని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య అన్నారు, మండలంలోని కొండపేట సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో, స్పెషల్ ఆఫీసర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామ సచివాలయాల పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలెంటర్ను ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు, దీంతో  50ఇండ్ల కు సంబంధించిన సమస్యలను ఆవాలంటీర్ అధికారుల దృష్టి కి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలన్నారు, ఇలా కచ్చితంగా చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని ఆయన అన్నారు, అలాగే సచివాలయాలకు వచ్చే ప్రజల పట్ల సక్రమంగా నడుచుకోవాలని ఆయన తెలియజేశారు, అలా కాకుండా మన ప్రవర్తనలో తేడా ఉంటే మనపై చులకన భావన ఏర్పడుతుందని  తెలిపారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా వాలంటీర్లు చొరవ చూపాలని తెలిపారు, అలాగే కొండపేట గ్రామంలో బియ్యం సక్రమంగా ఇవ్వలేదని ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై స్పందించిన అధికారులు సక్రమంగా ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేయాలని, కానీ యెడల చర్యలు తప్పవని, వీఆర్ఏలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించాలని తెలియజేశారు, అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణాలకు సంబంధించి మాట్లాడుతూ సొంత స్థలాలు, అలాగే లే అవుట్ లలో లబ్ధిదారు నిర్మించే గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆయన సూచించారు, అదేవిధంగా రోడ్డుకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కొంతమంది రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారని అక్కడి ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు అడ్డుకుంటున్న వారిని పిలిపించి మాట్లాడటం జరిగింది, ఈ రోడ్డుకు సంబంధించి పట్టా కలిగినటువంటి స్థలాలు ఉన్నాయని, కొంతమంది వ్యక్తులు రోడ్డును ఆక్రమించి కట్టుకోవడం జరిగిందన్నారు, దీనిపై అధికారులు చొరవ తీసుకొని సర్వే చేయించి ఎంతవరకు రోడ్డు ఉందో అంతవరకు రోడ్డు వేయవలసిందిగా కోరడం జరిగింది, దీనికి అధికారులు స్పందించి వారంలోపు సర్వే నిర్వహించి రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు, అలాగే లైన్మెన్ రమణ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని అధికారులు దృష్టికి తీసుకురాగా అధికారులు లైన్మెన్ ను ఎందుకు పనిచేయడం లేదని అడగడం జరిగింది, మా పరిధిలో వరకే పనిచేస్తామని అలా కాకుండా సచివాలయ పనులు చేయాలంటే చేయబోమని మీరు ఏ చర్యలు తీసుకున్న దానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేయడం జరిగింది, దీనికి సంబంధించి సంబంధించి అధికారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్ని చేయనంటే ఎలా, మాకే నువ్వు అలా సమాధానం చెబితే ప్రజలకెల పలుకుతావని , ఇతనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, ట్రాన్స్ఫర్ ఏఈ ఇతను పై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న ట్రాన్స్కో అధికారులకు తెలిపారు,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆయా అధికారులు స్పందించి  ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా సచివాలయ అడ్మిన్లు సిబ్బంది పని చేయాలని, దీనికి సంబంధించి వార్లంటీర్ల కృషి ఎంతో అవసరమని తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీడీవో గంగన్నపల్లి సురేష్ బాబు లు అన్నారు, ఈ సందర్భంగా వారు మండలంలోని కొండపేట గ్రామ సచివాలయంలో అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బందితో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ రఘురాం రెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ ఏ ఈ మురళి, ఏపీఎం గంగాధర్, మండల అధికారులు పాల్గొన్నారు.

About Author