PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తోక‌తో జ‌న్మించిన శిశువు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :బ్రెజిల్ లో వింతఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫోర్టెలెజా ప‌ట్టణానికి చెందిన ఓ మ‌హిళ పురిటినొప్పుల‌తో ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ప్రసవం అయింది. అయితే.. శిశువు తోక‌తో జ‌న్మించింది. ఇది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. గ‌తంలో ఆ మ‌హిళ‌కు వైద్య ప‌రీక్షలు చేసిన‌ప్పుడు తోక ఆన‌వాళ్ల బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని డాక్టర్లు వెల్లడించారు. డాక్టర్లు ఆ తోక‌ను నిజ‌మైన మాన‌వ తోక‌గా అభివ‌ర్ణిస్తున్నారు. అయితే ఈ తోక చ‌ర్మానికి మాత్రమే పెరిగింద‌ని, నాడీవ్యవ‌స్థకు ఎలాంటి సంబంధం లేద‌ని వైద్యులు తేల్చారు. దీంతో శ‌స్త్రచికిత్స ద్వార ఆ తోక‌ను తొల‌గించ‌నున్నారు.

About Author