PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘చిన్నారి పెళ్లి కూతురు’ బామ్మ ఇకలేరు

1 min read

సినిమా డెస్క్​ : నార్త్‌లో కలర్‌‌ చానెల్‌లో సుమారు ఎనిమిదేళ్ల పాటు ప్రచారమైన ధారావాహిక సీరియల్‌ ‘బాలికా వధు’. తెలుగులో ఈ సీరియల్‌ ‘మా’ టీవీలో ప్రసారమైంది. ఈ సీరియల్‌లో బామ్మ గా నటించిన ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా సిక్రీ (76) ఈ రోజు గుండెపోటుతో మరణించారు. ఈమెకు గత ఏడాది కూడా ఆరోగ్యం విషమించింది. అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సురేఖా సిక్రీ పరిస్థితి విషమంగా మారి, అకస్మాత్తుగా గుండెపోటుకి గురయ్యారు. బుల్లితెర, వెండితెరపై ఆమె నటనకు ఎన్నో అవార్డులు దక్కాయి. ముఖ్యంగా తమస్, సలీం లంగ్డే పే మత్ రో, జుబేదా, బదాయి హో వంటి సినిమాల్లోని ఆమె నటనకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఆమెను అందరికీ దగ్గర చేసింది మాత్రం ‘బాలికా వధు’ సీరియల్‌. హిందీ బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన ఈ సీరియల్‌ను తెలుగులోనూ డబ్ చేశారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అంటూ తెలుగులో డబ్ చేసిన ఈ సీరియల్‌లో గడుసరి, మొండి, కోపిష్టి, ప్రేమను పంచే బామ్మగా సురేఖా సిక్రీ అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సురేఖా సిక్రీ మరణంతో బుల్లితెర తారలు స్పందిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో కనిపించారు.

About Author