నాపై నిరాదార ఆరోపణలు తగవు
1 min read–నిజాయితీగా పని చేస్తే నిందలా– విద్యుత్ ఏఈ, రామలింగారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : నిజాయితీగా మండల ప్రజలకు సేవలు చేస్తే తనపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇంతలో మోపడం సబబు కాదని తాను ఎలాంటి వాడినో మండల ప్రజలకు, నాపై అధికారులకు తెలుసని విద్యుత్ ఏ ఈ రామలింగారెడ్డి పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆయన చెన్నూరులో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గడపగడపకు మన కార్యక్రమంలో భాగంగా చెన్నూరు టౌన్ లో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, 16 లక్షల రూపాయలతో రెండు ట్రాన్స్ఫారంలను మంజూరు చేయించడం జరిగిందన్నారు, ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఒకటి రామాలయం వద్ద, మరొకటి స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న కాలనీలో పెట్టేందుకు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు, అయితే స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న కాలనీ లో పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫారం పెట్టాలని భావించగా అడ్డుకు ఆయన నిరాకరించడం జరిగిందని, మళ్లీ ఆయనే ఇంకోచోట స్థలం చూపించగా అక్కడ ట్రాన్స్ఫారం కొరకు దిమ్మె నేర్పించడం జరిగిందన్నారు, అయితే అక్కడ గుమ్మల్ల మధుసూదన్ రెడ్డి, అనే వ్యక్తి ఆక్షేపించడం జరిగిందన్నారు, ట్రాన్స్ఫారం మా ఇంటి వద్ద పెట్టడం మాకు ఇబ్బంది కరం కాదని, అయితే ఇక్కడ ఆకులు కొట్టు ఉండడం దీంతో ఎండు గడ్డి, అరటి ఆకులు ఉండడం, అలాగే ఆకులు గంపలు ఎత్తుకుపోవడానికి లారీలు రావడం తో దారి ఇరుకు కాగా, ఏవైనా మంటలు చెలరేగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున మేము ట్రాన్స్ఫారం ను వేరే చోటికి తరలించాలని ఆయన తెలపడం జరిగిందన్నారు, అంతేకాకుండా గత నెల ఆగస్టు 16వ తేదీన సంబంధిత అధికారులకు ఆయన లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగిందన్నారు, అంతేకాని నేను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని, ఎవరిని ఇబ్బందులు పెట్టలేదని ఆయన తెలియజేశారు, కావాలని నాపై బురద చల్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, మండలంలో రైతులకు గాని, ప్రజలకు గాని ఎలాంటి సమస్యలు ఉన్న, వారు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించడం జరిగిందన్నారు, అలాంటిది వెయ్యికి రెండు వేలకు అమ్ముడు పోయే మనస్తత్వం తనది కాదని అలా మాట్లాడడం చంద్రశేఖర్ రెడ్డికి తగదని ఆయన హితవు పలికారు, తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ఆయన తెలిపారు, ఏవైనా ఇలాంటివి ఉంటే రుజువు చేయాలని అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు, ఇలాంటి తప్పుడు మాటలు ప్రజలు నమ్మరని పనిచేసే అధికారులపై ఇలా బురద జల్లడం మానుకోవాలని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్ లు పాల్గొన్నారు