PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణానది అందాలు.. అద్భతం : నాగేంద్రనాథ్ సిన్హా

1 min read

–రోప్ వే , బోటింగ్​ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి , కలెక్టర్ పి.కోటేశ్వర రావు

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో బోటు ప్రయాణం చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా.. కృష్ణానది అందాలు అద్భుతం అంటూ కితాబిచ్చారు. బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శనార్థం వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రోప్ వే మరియు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో అరకిలోమీటరు ప్రయాణించారు.  కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాతోపాటు కలెక్టర్​ పి. కోటేశ్వరరావు, జాయింట్​ కలెక్టర్​ డా.మనజీర్ జిలానీ సామూన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి వెళ్లారు.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించిన గైడ్ శ్రీశైలం ప్రాజెక్టు, ఎడమ, కుడి పవర్ హౌస్ లు, కృష్ణా నది అందాలు, పాతాళ గంగ, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చరిత్ర, నల్లమల అటవీ ప్రాంతం పై కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు వివరించారు. రోప్ వే మరియు బోటింగ్ లో కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఈశ్వరయ్య, అధికారులు పాల్గొన్నారు.

About Author