PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరో ఉద్యమానికి నాంది ఢిల్లీ కార్మిక కర్షక ఢిల్లీ పోరాటం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏప్రిల్ 5వ తేదీ ఢిల్లీలో జరుగు మజ్దూర్ ,కిషన్( కార్మిక, రైతు) పోరాటం దేశంలో రైతుల, కార్మికుల హక్కుల కోసం జరుగు మరో ఉద్యమానికి నాంది అని, ప్రజలంతా ఈ ఆందోళనను బలపరచాలని సిఐటియు రాష్ట్ర నాయకులు గౌస్ దేశాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి పేర్కొన్నారు. ఈనెల 5వ తారీఖున ఢిల్లీలో జరుగు మస్దూర్ కిషన్ సంఘర్ష పోరాటానికి కోటకొండ, దేవనకొండ, తేర్నేకల్ గ్రామాల నుంచి 46 మంది రైతు, వ్యవసాయకార్మికులు, సిఐటియు కార్యకర్తలు, నాయకులు వెళ్లారు .ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఢిల్లీ పోరాటానికి వెళ్తున్న వారిని ఘనంగా సాగనంపుతూ డప్పులతో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో కార్పొరేట్ల ప్రభుత్వం ఉందని అందువలన బడుగు బలహీన వర్గాలు,రైతు కార్మిక కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు, దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, దేశ సంపదనంతా ఒక వర్గానికి కట్టబెడుతూ, దేశ ప్రజానీకాన్ని బజారులో నిలబెడుతుందని విమర్శించారు. అచ్చే దిన్ అని పేర్కొన్న మోడీ భవిష్యత్తుని అంధకారమయం చేశాడని, స్వాతంత్ర అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేల దేశ సంపదనంతా లూటీ చేసే దొంగలు బాగుపడుతున్నారని , కష్టం చేసే కార్మికులకు హక్కులు లేకుండా, రైతుల గిట్టుబాటుల ధర లేకుండా, వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా, ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఉద్యోగము ఉపాధి కొరకు ,కార్మిక హక్కులను కాలరాస్తున్న ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక , వ్యవసాయ కూలి లు ఈనెల 5వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారని, ఈ పోరాటం రాబోయే రోజుల్లో తీవ్రపోరాటంగా మారనున్నదని అన్నారు. రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం, ఉపాధి కోసం, గిట్టుబాటు ధర కోసం ప్రజలంతా ఉద్యమాలకు రావడం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రజా సంఘాల నాయకులు మహబూబ్ బాషా ,యూసుఫ్, ఓంకార్, బజారి ,రాఘవరెడ్డి, శ్రీనివాసులు, రామాంజనేయులు, చిన్న ఎల్లప్ప, సుభాను, మల్లి, గోవిందు, కథాలుతదితరులు పాల్గొన్నారు.

About Author