NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ మ‌హానాడు ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలుగు దేశం పార్టీ మ‌హానాడు ప్రారంభమైంది. క‌రోన నేప‌థ్యంలో రెండో ఏడాది కూడ వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హానాడు ప్రారంభించారు. తెలుగుదేశం వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూల‌మాల వేసి మ‌హానాడు ప్రారంభించారు. క‌రోన బారిన‌ప‌డి మ‌ర‌ణించిన తెలుగుదేశం నేత‌లు, కార్యక‌ర్తల‌కు నివాళి అర్పించారు. క‌రోన‌తో మృతి చెందిన పార్టీ కార్యకర్తల‌కు పార్టీ అండ‌గా ఉంటుంద‌ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు. క‌రోన విప‌త్కాలంలో ప్రజ‌ల‌ను ఆదుకోవ‌డంలో జ‌గ‌న్ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని చంద్రబాబు నాయుడు విమ‌ర్శించారు. సంక్షోభ నివార‌ణ‌కు క‌లిసి పనిచేద్దామ‌న్నా కూడ ప్రభుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. ప్రజ‌ల‌కు భ‌రోసా ఇచ్చే ప‌రిస్థితిలో ప్రభుత్వం లేద‌ని విమ‌ర్శించారు.

About Author