పల్లె వెలుగు వెబ్ : వేరుశనగ పల్లీలతో ఎంతో ప్రయోజనం ఉందని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు గుండె ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తాయని , కొలెస్ట్రాల్ తగ్గించడం తో పాటు చిన్న చిన్న కణతులు ఏర్పడకుండా కాపాడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పల్లీలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు శాతం కూడా ఎక్కువే. అయితే పల్లీల వల్ల బరువు పెరగరు. క్రమం తప్పకుండా పల్లీలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. పల్లీలలో ఐసోఫ్లోవాన్స్, రిసర్వట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా కాపర్, నియాసిన్, ఫోలోట్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నిషియం, థైమైన్, విటమిన్ ఈ వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి.